Wednesday, January 15, 2025
HomeUncategorizedపాము తల నోట్లో పెట్టుకొని యువ‌కుడి విన్యాసం

పాము తల నోట్లో పెట్టుకొని యువ‌కుడి విన్యాసం

Date:

పాము అని పేరు చెప్ప‌గానే చాలా మంది వ‌ణికిపోతారు. ఇంకా పాము క‌నిపిస్తే హ‌డ‌లిపోతారు. అలాంటిది విష స‌ర్పంతో విన్యాసం యువ‌కుడి ప్రాణాల‌ను బ‌లి తీసుకున్న‌ది. నాగుపామును ప‌ట్టిన త‌ర్వాత‌.. ఫోటోల‌కు ఫోజు ఇచ్చేందుకు ఆ పాము త‌ల‌ను నోట్లో పెట్టుకున్నాడు ఓ యువ‌కుడు. అయితే ఆ విన్యాసం కాస్త విక‌టించింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ లోని దేశాయిపేట గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పాములు ప‌ట్టే శివ ఆ పాము కాటుకు బ‌ల‌య్యాడు.

గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ సముదాయంలోకి దాదాపుగా 6 ఫీట్ల అడుగుల నాగుపాము వచ్చింది. దాన్ని గమనించిన స్థానికులు స్నేక్ క్యాచ‌ర్‌ శివకు సమాచారం అందించారు. నాగుపామును పట్టుకున్న శివ దానిని అలాగే నోట్లో పెట్టుకుని గ్రామ‌స్థుల ముందు విన్యాసాలు చేశాడు. పాము త‌ల‌ను నోట్లో పెట్టుకుని ఫోటోలు దిగాడు. కొంద‌రు దీన్ని వీడియో కూడా తీశారు. ఇంతలోనే ఆ పాము నోట్లోనే కాటు వేసిన‌ట్లు తెలిసింది. నోట్లో నాగుపాము తలను పెట్టుకొని సాహసాలు చేస్తున్న సమయంలో పాము కాటు వేసిన విషయాన్ని శివ గ్రహించలేకపోయాడు. ఇంటివద్ద అచేతనంగా పడి ఉన్న శివను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అప్ప‌టికే అత‌ను చెందినట్లు వైద్యులు తెలిపారు.