Wednesday, October 30, 2024
Homeతెలంగాణ200గ్రాముల బంగారంతో నేసిన చీర‌

200గ్రాముల బంగారంతో నేసిన చీర‌

Date:

200 గ్రాముల పసిడితో బంగారు చీర తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మరో అరుదైన రికార్డు సృష్టించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త 200 గ్రాముల బంగారంతో చీర తయారు చేయాలని కోరారు. ఈ చీరను తయారు చేయడానికి ఆరు నెలల క్రితమే ఆర్డర్ తీసుకున్నట్లు విజయ్ తెలిపారు. బంగారాన్ని జరి తీయడానికి కొత్త డిజైన్ తయారు చేయడానికి 10 నుంచి 12 రోజులు పట్టింది.

ఈ చీర 49 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవు, బరువు 800 నుంచి 900 గ్రాములు ఉంటుందన్నారు. ఆ వ్యాపారవేత్త వచ్చే నెల 17న జరిగే తన కుమార్తె వివాహానికి ఈ చీరను తయారు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈ చీరను రూ.18 లక్షల వ్యయంతో తయారు చేసినట్లు విజయ్‌కుమార్‌ తెలిపారు. బంగారంతో చీర తయారు చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.