Wednesday, October 30, 2024
Homeతెలంగాణమ‌యోనైజ్‌పై తెలంగాణ ప్ర‌భుత్వం నిషేధం

మ‌యోనైజ్‌పై తెలంగాణ ప్ర‌భుత్వం నిషేధం

Date:

ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్‌పై తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ నిషేధిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో హోటళ్లు, ఫుడ్‌స్టాళ్లలో తరచూ తనిఖీలు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. రాష్ట్రంలో కొత్తగా 3 ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు, 5 మొబైల్‌ ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. కల్తీ ఆహారం తీసుకొని పలువురు తీవ్ర అనారోగ్యం పాలవుతోన్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మయోనైజ్‌ను ఎక్కువగా.. మండి బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లు, ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకుని తింటారు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలతో బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది. ఎన్నిసార్లు చెప్పినా హోటళ్లు తీరు మార్చుకోవట్లేదంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ పదార్థాన్ని నిషేధించేందుకు అనుమతి కోరింది.