Thursday, January 2, 2025
Homeతెలంగాణప్ర‌తి విద్యార్థి క‌ల‌ల‌ను నిజం చేస్తాం

ప్ర‌తి విద్యార్థి క‌ల‌ల‌ను నిజం చేస్తాం

Date:

తెలంగాణ‌లో ప్ర‌తి విద్యార్థి కలలను నిజం చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. జవహర్‌లాల్‌ నెహ్రూ భారత తొలి ప్రధానే కాదు.. దేశాన్ని ప్రపంచం ముందు గొప్పగా చూపించిన నేత. నవీన భారత రూపశిల్పి నెహ్రూ. రూ.5వేల కోట్లతో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు నిర్మిస్తాం. ఇటీవలే హాస్టల్‌ విద్యార్థులకు ఇచ్చే డైట్‌, కాస్మోటిక్‌ ఛార్జీలు పెంచాం. రాష్ట్రంలో గత పదేళ్లలో 5వేల పాఠశాలలు మూతపడ్డాయి. బడ్జెట్‌లో 7 శాతానికి పైగా నిధులు విద్యాశాఖకు కేటాయించాం. ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని పదోన్నతులు ఇచ్చాం, బదిలీలు చేశాం. 11,062 టీచర్‌ పోస్టులు భర్తీ చేశాం. టీచర్‌ పోస్టుల భర్తీ ద్వారా విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నిరూపించాం” అని సీఎం తెలిపారు.

పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించండి

”ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. వర్సిటీలకు ఉపకులపతులను నియమించాం. విద్యా వ్యవస్థను బాగు చేసేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. ప్రభుత్వ టీచర్లకు ఉన్న అర్హత ప్రైవేటు ఉపాధ్యాయులకు లేదు. అయినా పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించడానికి ఇష్టపడట్లేదు. ప్రభుత్వ బడుల ప్రతిష్ట పెంచే బాధ్యత టీచర్లదే. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో విద్యార్థులను కలిసి సమస్యలు తెలుసుకోవాలి. నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 7 వరకు విజయోత్సవాలు నిర్వహిస్తున్నాం. అనుకున్న విధంగా బాలల దినోత్సవం రోజున ఉత్సవాలు ప్రారంభించాం.