తెలంగాణలో బిజెపి పార్టీ డిసెంబర్ 1 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పాదయాత్రలు చేపట్టనుంది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ పాదయాత్రలు చేపట్టనుంది. పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భాజపా నిర్ణయించింది. ఈ నెల 15 లేదా 16న మూసీ పరివాహక ప్రాంతాల్లో రాత్రి వేళల్లో బస చేయాలని భాజపా నేతలు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించిన భాజపా నేతలు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో రాత్రి వేళల్లో బస చేయనున్నారు.