Friday, December 27, 2024
Homeతెలంగాణదేశంలో ఉన్న‌వి మోడీ వ‌ర్గం, గాంధీ వ‌ర్గం

దేశంలో ఉన్న‌వి మోడీ వ‌ర్గం, గాంధీ వ‌ర్గం

Date:

తెలంగాణ‌లో మైనారిటీ సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ”మెజారిటీ, మైనారిటీ ఇద్దరూ ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటి వారు. స్వాతంత్య్రం రాగానే మౌలానా అబుల్‌ కలామ్‌ను నెహ్రూ విద్యాశాఖ మంత్రిని చేశారు. విద్యా వ్యవస్థలో మౌలానా అబుల్‌ కలామ్‌ అనేక విధానాలు తెచ్చారు.

దేశంలో 2 వర్గాలే ఉన్నాయి ఒకటి మోడీ వర్గం.. మరొకటి గాంధీ వర్గం. హిందూ ముస్లిం భాయి భాయి అన్నదే కాంగ్రెస్‌ విధానం. చార్మినార్‌ వద్ద గతంలో రాజీవ్‌ గాంధీ సద్భావన యాత్ర చేశారు. అదే చార్మినార్‌ వద్ద రాహుల్‌ గాంధీ కూడా సద్భావన యాత్ర చేశారు. నాలుగు ఎమ్మెల్సీల్లో ఒకటి మైనారిటీలకు ఇచ్చాం. ఈ ప్రభుత్వంలో అనేక పదవులు అప్పగించాం. మైనారిటీలకు మా పార్టీ 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది. వాళ్ల రిజర్వేషన్లను రద్దు చేసేందుకు మోడీ యత్నిస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిని ఓడించాలి” అని రేవంత్‌రెడ్డి అన్నారు.