Tuesday, October 22, 2024
Homeతెలంగాణతెలంగాణ‌లో మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

తెలంగాణ‌లో మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Date:

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మంగ‌ళ‌వారం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, హైదారాబాద్‌తో పాటు కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతంలో కొనసాగిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ మంగళవారం ఉదయం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ మరింత బలపడి ఈ నెల 23న తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ 24న ఉదయానికి తీవ్ర తుపానుగా ఉద్ధృతి చెంది ఒడిశా-పశ్చిమబెంగాల్‌ తీరాన్ని 24న రాత్రి లేదా 25న ఉదయం పూరి, సాగర్‌ ఐలండ్స్‌ మధ్య దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావం తెలంగాణపై ఉండే అవకాశం లేదని అధికారులు తెలిపారు.