Thursday, January 2, 2025
Homeతెలంగాణఆ ముగ్గురూ నేత‌లు మూసీ ఒడ్డున ఉంటారా..

ఆ ముగ్గురూ నేత‌లు మూసీ ఒడ్డున ఉంటారా..

Date:

మూసీ దుర్గంధంలో మగ్గిపోతున్న వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని మూసీన‌ది అభివృద్ది ప్రాజెక్టు తలపెట్టామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నగరం మధ్య గుండా నది వెళ్తున్న రాజధాని మరొకటి ఈ దేశంలో లేదు. దాదాపు 300 కి .మీ ప్రవహించే మూసీకి ఎంతో చరిత్ర, విశిష్టత ఉంది. మేం చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవం. కొందరు మెదడులో మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకొన్నారు. మెదడులో విషం నింపుకొని మూసీ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన. మల్లన్న సాగర్‌, వేమలఘాట్‌లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలి. రాత్రికి రాత్రే పోలీసులతో కొట్టించి, గుర్రాలతో తొక్కించి మేం ఖాళీ చేయించటం లేదు. రంగనాయక్‌సాగర్‌, కొండపోచమ్మ.. ఇలా ఎక్కడికైనా నేను వస్తా. నేడు మూసీ నది కాలుష్యానికి ప్రతీకగా మారింది. 1600కు పైగా నివాసాలు పూర్తిగా మూసీ నది గర్భంలో ఉన్నాయి. మల్లన్నసాగర్‌లో మునిగిపోయిన 14 గ్రామాల్లో ఎలా వ్యవహరించారో తెలుసా? మేం ఉన్నపళంగా, నిర్దయగా ఎవరినీ ఖాళీ చేయించలేదు. నిర్వాసితులకు రెండుపడక గదుల ఇళ్లు కేటాయించి, రూ.25వేలు ఇచ్చాం. చెరువుల్లో అక్రమంగా నిర్మించుకున్న భవనాలనే హైడ్రా కూల్చింది. మూసీ పరివాహకంలో ఎవరి ఇళ్లను హైడ్రా కూల్చలేదు. చినుకు పడితే చాలు హైదరాబాద్‌లో గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. రోడ్లపై పడిన వర్షపు నీరు చెరువుల్లోకి, నదుల్లోకి చేరాలా.. అలాగే రోడ్లపై ఉండాలా?” అని సీఎం ప్రశ్నించారు.

మాట్లాడే నేత‌లు మూసి ఒడ్డున ఉండాలి

”మూసీ సుందరీకరణ కోసం ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్‌ అనలేదా? అడ్డుకుంటున్న నేతలు 3 నెలలు మూసీ ఒడ్డున జీవించాలి. కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల 3 నెలలు మూసీ ఒడ్డున ఉండాలి. వాళ్లు 3 నెలలు అక్కడ ఉంటామంటే కావాల్సిన వసతులు కూడా కల్పిస్తాం. ఆ ముగ్గురూ మూడు నెలలు అక్కడ ఉంటే.. ఈ ప్రాజెక్టును ఆ పేస్తాం. మూసీ పరివాహకంలోనే ఉండి ప్రజల కోసం పోరాడాలి, వారి జీవితం బాగుందని నిరూపించాలి. మూసీ ప్రజల కోసం ఏం చేద్దామో అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలి. మూసీ పునరుజ్జీవం కోసం మీ వద్ద ఉన్న ప్రణాళిక చెప్పండి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలి. విపక్ష నేతల సందేహాలు ఏమిటో చెప్పాలి” అని సీఎం ప్రశ్నించారు.