Thursday, October 31, 2024
HomeUncategorizedరైలు పట్టాలు దాటుతుండగా మరణించిన వృద్ధుడు

రైలు పట్టాలు దాటుతుండగా మరణించిన వృద్ధుడు

Date:

రైలు పట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడిని రైలు ఢీకొట్టడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఆ మృతదేహం రైలు ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకోవడంతో ప్రమాదం జరిగిన సంఘటన నుంచి ఘట్‌కేసర్ వరకు సుమారు 5 కిలోమీటర్లు అలాగే వేలాడుతూ వచ్చింది. ఘట్‌కేసర్ ప్రాంతంలో రైల్వే గేట్ పడగా.. రైలుకు మృతదేహం వేలాడుతూ రావడాన్ని చూసిన వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మృతదేహాన్ని చూసి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు రైలును ఆపి మృతదేహాన్ని బయటకు తీశారు.

బీబీనగర్, ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ మధ్య వృద్ధుడు రైలు దాటేందుకు ప్రయత్నం చేశాడని, ఇంతలో వరంగల్ నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో వృద్ధుడు రైలు ముందు భాగానికి చిక్కుకోవడంతో సుమారు 5 కిలోమీటర్ల మేరకు వేలాడుతూ వచ్చిందని తెలిపారు. మృతి చెందిన వృద్ధుడు నీలం రంగు చొక్కాఆరెంజ్ లుంగీ, కుడిచేతికి కడియం ధరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాగా, ప్యాసింజర్ రైలు..వరంగల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.