Thursday, October 31, 2024
HomeUncategorizedరాపిడో యాప్ ద్వారా మెట్రో రైలు టికెట్

రాపిడో యాప్ ద్వారా మెట్రో రైలు టికెట్

Date:

రైడ్-హెయిలింగ్ సర్వీస్ రాపిడో హైదరాబాద్ లోని తమ వినియోగదారులకు సమీకృత ప్రయాణ పరిష్కారాన్ని అందించడానికి ఎల్&టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్‌తో జతకట్టింది. ఈ సహకారంతో వినియోగదారులు రాపిడో యాప్ ద్వారా నేరుగా మెట్రో టిక్కెట్‌లను బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది.

ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా 15% టిక్కెట్ విక్రయాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రయాణికులు యాప్ ద్వారా సమీపంలోని మెట్రో స్టేషన్‌కు రైడ్‌ను ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. తద్వారా వారు ఎంచుకున్న గమ్యస్థానాలకు టిక్కెట్లను సులభంగా కొనుగోలు చేయవచ్చు. రాపిడోతో కొత్త భాగస్వామ్యం చివరి-మైల్ కనెక్టివిటీకి సమర్థవంతమైన పరిష్కారాన్ని అందించడం ద్వారా ఈ నిబద్ధతను పెంచుతుందని హైదరాబాద్ మెట్రో లైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ఉద్ఘాటించారు. శనివారం ఒప్పందాన్ని ప్రకటించిన కార్యక్రమంలో ఎండి, సిఇఒ కెవిబి రెడ్డితో పాటు, మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ, సుధీర్ చిప్లుంకర్, సిఓఓ, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్‌కు అధిపతి బిభుదత్త మిశ్రా ఇతర అధికారులు పాల్గొన్నారు.