Thursday, October 31, 2024
HomeUncategorizedరాగల నాలుగు రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం

రాగల నాలుగు రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం

Date:

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎండలు మండుతున్నాయి. మొన్నటి వరకు వాతావరణం కాస్త చల్లబడింది. జనానికి కూడా కాస్తా ఊరటనిచ్చినట్లయ్యింది. ఆదివారం నుంచి ఎండలు మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలోనే వాతావరణశాఖ కీలక హెచ్చరికలు చేసింది. రాగల నాలుగు రోజుల్లో ఎండలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

ఈ నెల 17 నుంచి 18 వరకు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 19 నుంచి 20 మధ్య రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పలుచోట్ల నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని వివరించింది.