Thursday, October 31, 2024
HomeUncategorizedరాగల ఐదు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు

రాగల ఐదు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు

Date:

తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం కుమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది.

ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మంగళవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం బుధవారం బలహీనపడినట్లు తెలిపింది. రుతుపవన ద్రోణి బుధవారం జైసాల్మయిర్, కోట, గుణ, కళింగపట్నం తూర్పు ప్రాంతం గుండా మధ్య బంగాళాఖాతం వరకు పయనిస్తూ సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మరో అల్పపీడనం ఈ నెల 19న పశ్చిమ మధ్య దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.