Thursday, October 31, 2024
HomeUncategorizedభర్త జ్ఞాపకార్థం గుడి కట్టించిన భార్య

భర్త జ్ఞాపకార్థం గుడి కట్టించిన భార్య

Date:

భర్త చనిపోతే ఆయన జ్ఞాపకాలను గుర్తుగా ఉంచుకొనేందుకు భార్య గుడి కట్టించింది.. తాజాగా తెలంగాణలోనే ఈ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్త తనతో లేడన్న విషయాన్ని భరించలేక తన గుర్తుగా గుడిని కట్టించింది.. ఈ రోజూ ఆ గుడిని ప్రారంభించింది.. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ లో వెలుగు చూసింది. జిల్లాలోని పర్వతగిరి శివారు సోమ్లా తండాలో కళ్యాణి అనే మహిళ భర్త జ్ఞాపకార్థం గుడి కట్టించింది.. ఆమె భర్త కొన్ని రోజుల క్రితం మరణించారు.. ఆయన గుర్తుగా గుడి కట్టించింది.. ఆ గుడిలో ప్రతి మూలన తన భర్త జ్ఞాపకాలు ఉండేలా ప్రత్యేకంగా విగ్రహాన్ని తయారు చేయించి, ప్రతిష్ట చేసింది. ఈరోజు గుడిని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేసింది.. అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది..