Thursday, October 31, 2024
HomeUncategorizedబిఆర్ఎస్ రెండు ఎంపీలు గెలిచినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా

బిఆర్ఎస్ రెండు ఎంపీలు గెలిచినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా

Date:

తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనీసం 2 స్థానాల్లో గెలిచిన తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌ చేశారు. నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో ఆయన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం చేసిన కేసీఆర్‌.. ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడకు వస్తారని ప్రశ్నించారు.

నల్గొండలో బిజెపి, బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి, జిల్లాకి ఏమీ చేయని బిజెపి పార్టీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ మనుగడ ఉండదని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని చెప్పారు. కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే జిల్లాలో అభివృద్ధి జరగలేదన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.