Thursday, October 31, 2024
HomeUncategorizedబస్సులు ఆపడం లేదని రోడ్డుకు అడ్డంగా రాళ్లు

బస్సులు ఆపడం లేదని రోడ్డుకు అడ్డంగా రాళ్లు

Date:

ఎన్ని సార్లు మొర పెట్టుకున్న ఆర్టీసీ బస్సులు ఆగడం లేదు. ఇక చేసేదేమి లేక బస్సుల కోసం మహిళలు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం మాడాపూర్‌ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళ్లడంతో మహిళలు ఆదివారం ఆందోళన చేపట్టారు.

కల్వకుర్తి, అచ్చంపేట డిపోల నుంచి తెల్కపల్లి మీదుగా లింగాలకు నడిచే బస్సులు బీఆర్ఎస్‌ హయాంలో స్టేజీల వద్ద నిలిపేవారని మాడాపూర్‌, కోమటికుంట గ్రామాలకు చెందిన మహిళలు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడంతో డ్రైవర్లు బస్సులను స్టేజీల వద్ద ఆపడం లేదని ఆరోపించారు. చేసేదేమీలేక రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి నిరసన చేపట్టాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు.