Thursday, October 31, 2024
HomeUncategorizedబలమైన వ్యవస్థగా హైడ్రా ఏర్పాటు చేయాలి

బలమైన వ్యవస్థగా హైడ్రా ఏర్పాటు చేయాలి

Date:

గ్రేటర్‌ హైదరాబాద్ న‌గ‌ర‌ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా) విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… హోర్డింగ్స్‌, ఫ్లెక్సీల తొలగింపు బాధ్యత హైడ్రాకు ఇవ్వాలని సూచించారు. జోన్ల విభజనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నాళాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన నిబంధనలు రూపొందించాలని ఆదేశించారు. ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలని, అందుకు అవసరమైన ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.