తెలంగాణలో డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై, విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగానే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గుట్కా తయారి, విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
గుట్కాలు నిషేధం..
డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణను మార్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు దాన్ని ఆచరణలో పెట్టేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై, విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి అనుగూణంగానే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గుట్కా తయారి, విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సర్కారు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం 24 మే 2024 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.రాష్ట్రంలో యువత మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ వంటి వారికి అలవాటు పడి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. యువతపై అలాంటి ప్రభావం పడకూడదనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.