Friday, December 27, 2024
Homeతెలంగాణత‌న‌పై నమోదైన కేసును కొట్టివేయండి

త‌న‌పై నమోదైన కేసును కొట్టివేయండి

Date:

కొడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వాధికారులపై దాడి కేసులో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నరేందర్ రెడ్డిని గురువారం న్యాయవాదులు కలిశారు. వారి ద్వారా కోర్టుకు నరేందరెడ్డి అఫిడవిట్ పంపించారు.

”బుధవారం ఉదయం కేబీఆర్‌ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా కారులో ఎక్కించి వికారాబాద్ డీటీసీకి తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసులు నా స్టేట్‌మెంట్‌ తీసుకోదు. కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు కొన్ని పేపర్లపై నా సంతకాలు తీసుకున్నారు. నన్ను అక్రమంగా ఈ కేసులో ఇరికించారు. అరెస్టుకి ముందు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. కేటీఆర్‌ సహా ఇతర ముఖ్యనేతల అదేశాలతో దాడులు చేయించినట్లు పోలీసలు కట్టుకథ చెప్పారు. నేను పోలీసులకు ఎలాంటి వాగ్మూలం ఇవ్వలేదు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పినవన్నీ నిజం కాదు. నా స్టేట్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకొని విచారణ చేయాలి” అని కోర్టుకు పంపించిన అఫిడవిట్‌లో నరేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. మరో వైపు నరేందర్‌రెడ్డిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వికారాబాద్‌ జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.