Thursday, October 31, 2024
HomeUncategorizedగొంతు వణుకుతున్నా నిజమే మాట్లాడండి

గొంతు వణుకుతున్నా నిజమే మాట్లాడండి

Date:

స్మితా సబర్వాల్ ఏ పోస్టు పెట్టినా తన అభిమానులు, ఆమె ఫాలోవర్లు తెగ లైకులు కొట్టేవాళ్లు, కామెంట్లు పెట్టావాళ్లు. కానీ.. ట్రైనీ ఐఏఎస్‌ విషయంపై స్పందిస్తూ.. అఖిత భారత సర్వీసెస్‌లో దివ్యాంగుల కోటా అనవసరమంటూ తన అభిప్రాయం చెప్పటంపై దేశమంతా చర్చ నడిచింది. కాగా.. స్మితా సబర్వాల్ అభిప్రాయంతో కొంత మంది ఏకీభవించగా.. చాలా మంది వ్యతిరేకించారు. మాజీ ఐఏఎస్‌లు, ప్రజాప్రతినిధులు ఇలా ఎంత మంది ఆమెను వ్యతిరేకించినా.. స్మిత సబర్వాల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె తన అభిప్రాయంపై స్ట్రాంగ్‌గా నిల్చున్నారు.

దివ్యాంగులపై ఆమె పెట్టిన పోస్టులపై నెట్టింట దుమారం రేగుతున్న సమయంలో.. స్మితా సబర్వాల్ మరో ట్వీట్ వదిలారు. “కెరీర్ అనేది ప్రజల్లోనే ప్రారంభమైనా.. వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం అనేవి వ్యక్తిగతంగానే పెంపొందుతాయి. గొంతు వణుకుతున్నా నిజమే మాట్లాడండి..” అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. అయితే.. ఈ ట్వీట్, తాను అఖిల భారత్ సర్వీసెస్‌లో దివ్యాంగుల కోటా గురించి చేసిన కామెంట్‌కు కట్టుబడే ఉన్నానని.. ఏమాత్రం వెనక్కి తగ్గేదేలే అని చెప్పేందుకే చేసినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు.. తనను ఎంత మంది వ్యతిరేకించినా.. తను నిజమే మాట్లాడతానని.. వ్యతిరేకతను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం తనకు ఉందని చెప్పకనే చెప్తున్నట్టు అర్థమవుతోంది. తనను వ్యతిరేకిస్తున్న చాలా మందికి సమాధానంగానే ఈ ట్వీట్ చేసినట్టుగా అర్థమవుతోంది. ఈ ట్వీట్‌తో పాటు ఆమె తన రెండు ఫొటోలను కూడా జత చేయటం గమనార్హం. కాగా.. స్మితా సబర్వాల్ చేసిన ఈ ట్వీట్ మీద కూడా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.