Wednesday, January 15, 2025
HomeUncategorizedగంజాయి సేవిస్తున్న మెడికల్ విద్యార్థులు

గంజాయి సేవిస్తున్న మెడికల్ విద్యార్థులు

Date:

గంజాయి రోజురోజుకు విస్తరిస్తోంది. పల్లెలు, పట్టణాలకు వ్యాపిస్తోంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో గంజాయి కలకలం రేపింది. ఆరుగురు మెడికోలు గంజాయి సేవిస్తున్నట్లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మెడికోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అలాగే ఇద్దరు డ్రగ్‌ పెడ్లర్లను అరెస్టు చేశారు. విద్యార్థులకు సురేష్‌ సింగ్‌ అనే వ్యక్తి గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతని నుంచి 80 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.