Thursday, October 31, 2024
HomeUncategorizedఇదేనా కాంగ్రెస్‌ పార్టీది ద్వంద్వనీతి

ఇదేనా కాంగ్రెస్‌ పార్టీది ద్వంద్వనీతి

Date:

మాటలు మాత్రం చెప్పి చేతల్లోకి చాతకాని పార్టీ కాంగ్రెస్ పార్టీది ద్వంద్వనీతి అని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆక్షేపించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఎక్స్‌ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో పార్టీలోకి వెళితే వెంటనే అనర్హులు అయ్యేలా చట్టసవరణ చేస్తామని లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్‌.. అదివారం సిగ్గు లేకుండా బిఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకుందని విమర్శించారు. ‘పార్టీ ఫిర్యాయింపులపై నిన్న రాహుల్‌గాంధీ ఎన్నో మాట్లాడారు. గెలిచే వరకు ఒక మాట, గెలిచాక ఇంకో మాట అన్నట్టుగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోంది’ అని ఆక్షేపించారు. ఆ పార్టీ రీతి..నీతి ఇదేనా?అని ప్రశ్నించారు. భాజపాకు, కాంగ్రెస్‌కు తేడా ఏమిటని నిలదీశారు.