Wednesday, October 9, 2024
Homeక్రీడలుఒలింపిక్స్‌లో మ‌హిళ‌గా మారిన పురుషుడు..

ఒలింపిక్స్‌లో మ‌హిళ‌గా మారిన పురుషుడు..

Date:

పారిస్ ఒలింపిక్స్‌లో ఇటలీకి చెందిన మహిళా బాక్సర్ ఏంజెలా కారిని, అల్జీరియాకి చెందిన బాక్సర్ ఇమానే ఖలీఫ్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 సెకన్లలోనే ఓడిపోయింది.. ఇమానే ఖలీఫ్ దాడికి తట్టుకోలేక తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ఏంజెలా కారిని ప్ర‌క‌టించింది. అయితే గత ఏడాది జరిగిన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో జెండర్ ఎలిజబిలిటీ టెస్టులో ఇమానే ఖలీఫ్ ఫెయిల్ అయ్యింది. ఆమెలో పురుష జెన్యువులు ఎక్కువగా ఉన్నాయని, ఖలీఫ్‌ని ‘బయోలాజికల్ మెన్’గా ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ గుర్తించింది. జెన్యు పరీక్షలో ఫెయిల్ అయినప్పటికీ ఇమానే ఖలీఫ్‌కి ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. ఖలీఫ్ కొట్టిన మొదటి షాట్ దెబ్బకు ఏంజెలా కారిని దవడ పగలి, రక్తం వచ్చింది. మొదటి రౌండ్‌లో ఖలీఫ్ కొట్టిన దెబ్బలకు తాళలేకపోయిన ఏంజెలా కారిని, చేతులు ఎత్తేసి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది..

‘నా తండ్రి కోసం పోటీలో నిలిచాను. నా జీవితంలో ఎప్పుడూ ఇంత బలంగా కొట్టలేదు. ఇంత గట్టిగా దెబ్బలు తినలేదు. నేను చివరి వరకూ పోరాడాలనే అనుకున్నా.. కానీ నా బతుకు మీద ఆశతో పోటీ నుంచి తప్పుకున్నా… పతకం కంటే ప్రాణాలు నిలుపుకోవడం ముఖ్యం కదా.. నా ముక్కుకి తగిలిన దెబ్బకు ఏం జరగబోతుందో అర్థమైంది.. అందుకే దీన్ని కొనసాగించకపోవడమే మంచిదని నిర్ణయం తీసుకున్నా.. నా ఉద్దేశంలో ఇది ఓటమి కాదు… రింగ్‌లో బరిలో దిగినప్పుడే నేను గెలిచినట్టు లెక్క..’ అంటూ ఏంజెలా కారిని వ్యాఖ్యానించింది.. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇమానే ఖలీఫ్‌తో చేతులు కలిపేందుకు ఏంజెలా కారిని ఇష్టపడలేదు. ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి సోషల్ మీడియా ప్రపంచమంతా చర్చ జరుగుతోంది. చూడడానికి ఏ విధంగానూ మహిళగా లేని ఖలీఫ్‌ని మహిళగా ఎలా గుర్తిస్తారంటూ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. ఇది మహిళలపై జరుగుతున్న పురుషాహంకార దాడిగా ఫెమినిస్టులు ఆరోపిస్తున్నారు..