Saturday, December 21, 2024
Homeక్రీడలుబీచ్ వాలీబాల్ లో బుర్ఖా వర్సెస్ బికినీ

బీచ్ వాలీబాల్ లో బుర్ఖా వర్సెస్ బికినీ

Date:

పారిస్ ఒలింపిక్స్ 2024 పోటీల్లో కూడా బీచ్ వాలీబాల్ మ్యాచులు జరుగుతున్నాయి. అయితే ఈజిప్ట్ మహిళా బీచ్ వాలీబాల్ జట్టు, ఈ పోటీలకు వచ్చిన తీరు చర్చనీయాంశమైంది.. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒంటి నిండా బురఖా ధరించి, బరిలో దిగింది ఈజిప్ట్ మహిళా బీచ్ వాలీబాల్ టీమ్.. స్పానిష్ ప్లేయర్లు బికినీలో సూపర్ హాట్‌గా కనిపిస్తే.. ఈజిప్ట్ ప్లేయర్లు అరికాళ్ల నుంచి జట్టు దాకా అన్నింటినీ పరదా కింద కప్పేశారు.. లాంగ్ బ్లాక్ స్లీవ్స్ షర్ట్స్, బ్లాక్ లెంగ్త్ లెగ్గింగ్స్ వేసుకుని.. కాలేజీకి వెళ్తున్నట్టుగా వచ్చారు..

ఫ్రాన్స్ తరుపున ఆడుతున్న ఈజిప్ట్ ప్లేయర్లకు బురఖా ధరించేందుకు అనుమతి లేదు. పారిస్ ఒలింపిక్స్‌లో ఈ విషయం గురించి తీవ్రమైన చర్చ జరిగింది. ‘నాకు హిజాబ్‌ వేసుకుని ఆడడం ఇష్టం. ఆమెకి బికినీ వేసుకుని ఆడడం ఇష్టం. ఏదైనా ఓకే.. నగ్నంగా ఉన్నా, లేదా హిజాబ్ వేసుకున్నా.. అన్ని మతాలను, అన్ని సంస్కృతులను గౌరవించాలి.. మీరు బురఖా వేసుకొని ఆడాలని నేను చెప్పను. అలాగే మీరు కూడా నన్ను బికినీలో ఆడాల్సిందేనని చెప్పకూడదు.. ఇది స్వేచ్ఛా దేశం.. ఎవరికి నచ్చిన డ్రెస్సు, వాళ్లు వేసుకోవచ్చు..’ అంటూ ఈజిప్ట్ బీచ్ వాలీబాల్ ప్లేయర్ డువా ఎల్గోబసీ కామెంట్ చేసింది.