Thursday, November 21, 2024
Homeప్రత్యేక కథనాలుమోమోస్ తో అన్ని ఆనారోగ్య సమస్యలే..?

మోమోస్ తో అన్ని ఆనారోగ్య సమస్యలే..?

Date:

మోమోస్ ను కూరగాయల ముక్కలు లేదా చికెన్ చిన్న పీస్ లతో తయారుచేసి వాటిని ఆవిరి మీద ఉడికించి వివిధ రకాల చట్నీలతో మోమోస్ ను అందిస్తున్నారు. ఇతర జంక్ ఫుడ్ లాగానే మోమోస్ కూడా ప్రస్తుతం యువతకు బాగా అలవాటైపోయాయి. చాలామంది వీటికోసం ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్నారు. అయితే మోమోస్ తినడం ఎంత మాత్రం మంచిది కాదని వీటిని ప్రతిరోజు తినడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

*మోమోస్ తో డయాబెటిస్, బీపీ ప్రమాదం*

మోమోస్ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుందని, ఇది ఊబకాయానికి దారితీస్తుందని చెబుతున్నారు గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని, హైబీపీతో పాటుగా, డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా మోమోస్ పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. మోమోస్ ను మైదాపిండితో తయారుచేస్తారు. ఇది ఏ మాత్రం ఆరోగ్యకరమైన పిండి కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది.

*మోమోస్ తో జీర్ణ వ్యవస్థకు హాని*

మధుమేహం ఉన్నవారికైతే మోమోస్ తినడం మరింత హానికరం. మోమోస్ ఎక్కువగా తినడం వల్ల ఇది మీ జీర్ణ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి అనేక సమస్యలకు మోమోస్ కారణమవుతాయి. ఇక ఫుడ్ అలర్జీకి గురయ్యే అవకాశం కూడా ఉంది. మోమోస్ లో ఉపయోగించే గ్లూటెన్ లేదా సోయాసాస్ వంటి కొన్ని పదార్థాల వల్ల చర్మ సంబంధిత సమస్యలు, శ్వాస సమస్యలు, జీర్ణాశయ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి.

*క్యాన్సర్ వచ్చే చాన్స్ .. జాగ్రత్త*

గుండె జబ్బుల ప్రమాదం మోమోస్ కారణంగా పెరుగుతుంది. మోమోస్ తయారీకి ఉపయోగించే అజినిమోటో, ఎంఎస్జీ వంటి పదార్థాలతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మొత్తంగా మామోస్ మైదాతో పాటు అనారోగ్య కరమైన కొవ్వుల కలయిక కాబట్టి వీటిని తినడం మన ఆరోగ్యాన్ని మనం చేతులారా పాడు చేసుకోవడమేనని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు.