ఎవరైనా విదేశాలకు వెళితే వారికి వీసా, పాస్‌పోర్ట్ కావాలి. ఈ రెండు ఉంటేనే ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతి ఇస్తారు. కొన్ని దేశాల్లో వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ కూడా ఉంటుంది. అప్పుడు పాస్‌పోర్ట్ ఒక్కటి ఉంటే చాలు. అయితే మనదేశంలో ఒక రైల్వే స్టేషన్‌కు వెళ్లాలన్నా వీసా, పాస్‌పోర్ట్ అవసరం. ఇవి లేకపోతే లోపలికి అనుమతి ఇవ్వరు. పంజాబ్‌లోని అట్టారీ రైల్వే స్టేషన్‌లో ఈ నిబంధన ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు. అందుకు కారణాలేంటో తెలుసుకుందాం.
*పాక్ సరిహద్దుకు సమీపం*
అత్తారి శ్యామ్ సింగ్ రైల్వేస్టేషన్ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ జిల్లాలో ఉంది. భారత్-పాక్ మధ్య రాకపోకలకు కీలకమైన వాఘా బోర్డర్‌కు ఇది అవసరమైన సేవలను అందిస్తుంది. ఈ స్టేషన్‌లోకి రావాలంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి. ఎందుకంటే ఇది భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఉంటుంది. భారత్ వైపు నుంచి ఇదే చివరి స్టేషన్. భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్టేషన్‌లో పాస్‌పోర్ట్ నిబంధనను తప్పనిసరి చేశారు.
*ఒకప్పుడు లాహోర్‌కు రైల్వే సర్వీస్*
ఒకప్పుడు భారత్‌లోని అట్టారీ రైల్వేస్టేషన్ నుంచి పాకిస్తాన్‌లోని లాహార్ మధ్య రైల్వే సర్వీస్ నడిచేది. ఈ మార్గంలో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఎన్నో ఏళ్లపాటు సేవలందించింది. ఆ సమయంలో పాకిస్తాన్ సందర్శించాలనుకున్నవారు తప్పనిసరిగా పాకిస్తాన్ వీసా, పాస్‌పోర్ట్‌ను చూపిస్తే అట్టారీ స్టేషన్‌లోకి అనుమతిచ్చేవారు. అయితే వివిధ కారణాలతో ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా పాక్-భారత్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు.
*2019లో రైల్వే సర్వీస్ నిలిపివేత*
2019కు ముందు అట్టారీ స్టేషన్ నుంచి పాక్‌లోని లాహార్‌కు ప్రతిరోజు రైళ్లు నడిచేవి. పాస్‌పోర్ట్, వీసాను ధృవీకరించిన తర్వాత మాత్రమే ప్రయాణికులను స్టేషన్ లోపలికి అనుమతి ఇచ్చేవారు. అయితే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో 2019 నుంచి రైలు సర్వీస్‌ను నిలిపివేశారు.
*ప్రస్తుతానికి నాలుగు రైళ్ల రాకపోకలు*
ప్రస్తుతం అట్టారీ స్టేషన్‌కు నాలుగు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఒకటి సంఝౌతా ఎక్స్‌ప్రెస్. ఇది ఢిల్లీ నుంచి అట్టారీకి వారానికి రెండుసార్లు నడుస్తుంది. అమృత్‌సర్ నుంచి రెండు ప్యాసింజర్ రైళ్లు అట్టారీకి నడుస్తున్నాయి. జబల్‌పూర్ నుంచి ఒక ప్రత్యేక రైలు కూడా అట్టారీకి వస్తుంది. ఈ స్టేషన్‌లో మొత్తంగా మూడు ప్లాట్‌ఫారమ్స్ ఉంటాయి.