Sunday, December 22, 2024
Homeప్రత్యేక కథనాలుదావూద్ ఇబ్ర‌హీంని మించిపోయిన లారెన్స్ బిష్ణోయ్‌.. అతని ఆధీనంలో 700మంది షూటర్లు..?

దావూద్ ఇబ్ర‌హీంని మించిపోయిన లారెన్స్ బిష్ణోయ్‌.. అతని ఆధీనంలో 700మంది షూటర్లు..?

Date:

ఒక‌ప్పుడు అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం దేశాన్ని గడగడలాడించాడు. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ అలాంటి దావూద్ ఇబ్రహీంని మించిపోయాడు. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా లారెన్స్ బిష్ణోయ్ చర్చే నడుస్తోంది. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత లారెన్స్ పేరు లైమ్‌లైట్‌లోకి వచ్చింది. జైల్లో ఉంటూనే లారెన్స్ బిష్ణోయ్ ఇదంతా ఎలా చేయగలుగుతున్నాడనేది అంద‌రిని ఆశ్చర్యప‌రుస్తున్న విష‌యం..

*సల్మాన్‌కి బెదిరింపులు

హత్యకు గురైన బాబా సిద్దిఖీకి సల్మాన్ ఖాన్‌ అత్యంత సన్నిహితుడు. జింకను వేటాడి చంపాడన్న కేసులో సల్మాన్ ఖాన్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. జింకను ఆరాధ్య జంతువుగా కొలిచే కమ్యూనిటీకి చెందిన వాడే లారెన్స్ బిష్ణోయ్. ఆరాధ్య జంతువును చంపాడన్న కోపంతో సల్మాన్ ఖాన్ మీద ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశాడు. కొన్ని నెలల కిందట సల్మాన్‌పై జరిగిన హత్యాప్రయత్నం వెనుక ఉన్నది కూడా బిష్ణోయ్‌ తెలుస్తోంది. ఈ క్రమంలోనే సల్మాన్‌కి క్లోజ్ రిలేషన్ అయిన బాబా సిద్దిఖీకి కూడా లైఫ్ థ్రెట్ వచ్చింది. దీంతో ఆయనకు పోలీసులు వై ప్లస్ సెక్యూరిటీని కల్పించారు. అక్టోబర్ 12న అందరు చూస్తుండగానే నడిరోడ్డు మీద బాబా సిద్దిఖీ హత్యకు గురయ్యాడు. సరిగా మీసాలు కూడా రాని యువకులు ఈ హత్యకు పాల్పడటం పోలీసులను విస్మయానికి గురిచేసింది. ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ ఉంటాడనే అనుమానంతో పోలీసులు ఇంటరాగేషన్ చేశారు. నిందితులు కూడా తమ బాస్ బిష్ణోయ్ అని బహిర్గతం చేసినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన తర్వాత బిష్ణోయ్‌ తరఫున ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు కూడా చేశారు. దీంతో కచ్చితంగా లారెన్స్ బిష్ణోయే ఈ హత్య చేయించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

*గుజరాత్‌ జైల్లో బిష్ణోయ్‌

లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ జైల్లో ఉన్నాడు. 2014లో అరెస్టై పదేళ్లుగా కారాగారవాసం చేస్తున్నాడు. అయితే జైల్లో ఉన్న ఖైదీ బయట ఇంత తతంగం ఎలా నడుపుతున్నాడని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జైల్లో లారెన్స్‌కి ప్రత్యేకంగా సెల్‌ఫోన్ కేటాయిస్తున్నారు. ఈ ఫోన్ ద్వారానే అన్నింటినీ సెటిల్ చేస్తున్నాడు. ఇటీవల ఓ వీడియో ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం వీటికి మరింత బలం చేకూర్చింది. అలా పదేళ్లుగా జైలులో ఉంటూనే ఇంటర్నేషనల్ గ్యాంగ్‌ని తయారు చేశాడట. ప్రస్తుతం లారెన్స్ కింద దాదాపు 700 మంది షూటర్లు ఉన్నారట. వీరిని ప్రతి దేశంలో మోహరించి అసైన్‌మెంట్లు ఇస్తున్నాడని తెలిసింది. ఈ విధంగా 32 ఏళ్ల వయసులోనే మోస్ట్ నొటోరియస్ గ్యాంగ్‌స్టర్‌గా లారెన్స్ ఎదగడంతో దావూద్‌ని మించిపోయాడని అంటున్నారు.

*లారెన్స్‌ దేశభక్తుడా?

లారెన్స్‌ని దేశభక్తుడిగా చూడాలా? అన్న కోణం కూడా ఉంది. అనధికారికంగా లారెన్స్ ప్రభుత్వ ఏజెంటుగా నియమించి ఉండొచ్చు. నిఘా వర్గాలు కూడా గ్యాంగ్‌స్టర్లనే నియమించుకుని తమ టార్గెట్‌ని ఫినిష్ చేస్తాయి. దావూద్ ఇబ్రహీం టైంలోనూ ఇలాగే చేశారు. కాబట్టి భారత వ్యతిరేకులను అంతం చేసే అసైన్‌మెంట్ లారెన్స్‌కి అప్పగించారా? అన్న అనుమానాలు లేకపోలేదు. గతంలోనూ తాను నిజమైన దేశభక్తుడినని లారెన్స్ ప్రకటించుకున్నాడు. ప్రో ఖలిస్థానీలు, పాకిస్థానీలంటే లారెన్స్‌కు అస్సలు పడదు. సోషల్ మీడియాలోనూ లారెన్స్‌ దేశభక్తికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. లారెన్స్‌ని హీరోగా చిత్రీకరిస్తుండటం గమనార్హం.