Friday, September 20, 2024
Homeప్రత్యేక కథనాలుమనదేశంలో విడాకులకు వింత కారణాలు..

మనదేశంలో విడాకులకు వింత కారణాలు..

Date:

మన దేశంలో విడాకులు తీసుకునే భార్యాభర్తల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. చిన్న, చిన్న వింత కారణాలే విడాకులకు కారణమవుతున్నాయి. కొంతమంది భార్యాభర్తలు విచిత్రమైన కారణాలతో విడాకుల కేసు ఫైల్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇవి ఒక కారణాలు, వీటికి కూడా విడాకులు తీసుకుంటారా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విడాకులకు కారణమైన వింత కారణాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..

*రోజూ మ్యాగీ చేస్తుందని..*

కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఒక విచిత్రమైన కారణం చెబుతూ భార్య నుంచి విడాకులు కోరాడు. తన భార్య వంట సరిగా చేయదని చెప్పాడు. రోజూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీల్స్‌గా మ్యాగీనే చేసి పెట్టేదని వాపోయాడు. ఈ వంట తినలేక అతడు బాగా ఇబ్బంది పడ్డాడట. అందుకే విడాకులకు కేస్ ఫైల్ చేశాడు. చివరికి, వారిద్దరూ మ్యూచువల్ కన్సెంట్ తో విడాకులు తీసుకున్నారు.

*యూపీఎస్సీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడని..*

2019లో భోపాల్‌కు చెందిన ఒక మహిళ తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఆమె భర్త UPSC పరీక్షలకు చదువుకోవడంలో చాలా బిజీగా ఉన్నాడు. నాతో కలిసి ఉండడానికి టైం ఇవ్వడం లేదు. ఆయనతో కలిసి ఎక్కడికీ వెళ్లలేదు. తన బంధువులను కూడా కలవలేదు. UPSC పరీక్షలకు ప్రిపేర్ కావడం తప్ప వేరే ఏమీ పట్టించుకోలేదు. ఈ విషయం భోపాల్ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలో జరిగిన కౌన్సెలింగ్ సమయంలో వెలుగులోకి వచ్చింది.

*లడ్డూలు మాత్రమే తినాలని టార్చర్*

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, మీరట్‌ సిటీకి చెందిన ఒక కపుల్ పదేళ్లపాటు బాగానే కాపురం చేశారు. ‘నా భార్య ఒక తాంత్రికుడిని నమ్మడం మొదలుపెట్టింది. ఆ తాంత్రికుడి సలహా మేరకు నన్ను లడ్డూలు తప్ప వేరే ఏదీ తిననివ్వలేదు. రోజూ ఉదయం, సాయంత్రం నాలుగు నాలుగు లడ్డూలు మాత్రమే ఇచ్చేది. వేరే ఏ ఆహారం ఇవ్వలేదు. ఇలా రోజూ లడ్డూలు మాత్రమే తినిపించడం వల్ల చాలా ఇబ్బంది పడ్డా. చివరికి, నా భార్య ప్రవర్తనతో విసిగిపోయా. అందుకే 10 ఏళ్ల పెళ్లి జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నా.’ అని వివరించారు.

*అపరిశుభ్రంగా ఉన్నందుకు డివోర్స్‌*

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక మహిళ పెళ్లయిన కేవలం 40 రోజులకే తన భర్త నుంచి విడాకులు కోరింది. భర్తకు ఒంటి శుభ్రత అలవాట్లు లేవని, అతడి శరీరం నుంచి చెడు వాసన వస్తుందని ఆమె డివోర్స్ కోరింది. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అధికారులు విడాకులు ఎందుకు తీసుకుంటున్నావు అని ప్రశ్నిస్తే.. ఆ మనిషి నెలకు ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తాడని, వారానికి ఒకసారి గంగాజలం చల్లుకుంటాడని చెప్పింది.

*లైఫ్ పార్ట్‌నర్ ఎక్కువగా ప్రేమించాడని విడాకులు*

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాకు చెందిన ఒక మహిళ తన భర్తతో విడాకులు కోరుతూ షరియత్ కోర్టును ఆశ్రయించింది. భర్త తనను చాలా ప్రేమిస్తున్నాడని, తనతో ఎప్పుడూ గొడవ పడడని చెప్పింది. ఆమె మాటల్లో చెప్పాలంటే, భర్త ఆమెను ‘చాలా ఎక్కువ ప్రేమిస్తున్నాడు’. కానీ ఆమె కారణం విన్న షరియా కోర్టు ఆమెకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆ మహిళ స్థానిక పంచాయతీని కూడా ఆశ్రయించింది. ఈ ఘటన గురించి తెలుసుకున్నాక మహిళలు ఏం కోరుకుంటారో ఎవరికీ అర్థం కాదని చాలామంది కామెంట్ చేశారు.