భారత యువ ఆటగాడు గుకేశ్ తన అద్భుతమైన ప్రతిభతో ప్రపంచ చెస్ చాంఫియన్ షిప్ గెలుచుకున్నాడు. ఈ గెలుపుతో అతను ప్రపంచ వ్యాప్తంగా తన పేరును మరింత ప్రాచుర్యం పొందాడు. గుకేష్ యొక్క విజయాలు, భారత చెస్‌లో సరికొత్త అభ్యుదయాన్ని సూచిస్తున్నాయి. ఈ విజయంతో గుకేశ్ చెస్ లో భారత్ యొక్క గౌరవాన్ని పెంచాడు. అతను భారత దేశంలోని యువ చెస్ క్రీడాకారులకు స్ఫూర్తి ఇచ్చే ఆదర్శంగా నిలుస్తున్నారు. గుకేష్ తన శిక్షణ, క్రమసంగతితో చెస్ లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. వయస్సులో చిన్నదైనప్పటికీ, అతను అంతర్జాతీయ టోర్నమెంట్లలో పెద్దలను చీల్చి, అనేక చాంపియన్‌షిప్‌లు సాధించాడు. అతని ఆలోచనా శక్తి, చకచకా ప్రణాళికలు, సరిహద్దుల దాటి పోటీ చేసే ధైర్యం ఈ విజయాన్ని సాధించడానికి కీలకమైనవి.అయితే ఈ విజయానికి గుకేశ్ మొత్తం రూ. 11 కోట్లు గెలుచుకున్నాడు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ ప్రైజ్‌మనీలో నుంచి భారత ప్రభుత్వం చేసిన టాక్స్ కోతలు అంతా ఇంతా కాదు. గుకేశ్ కచ్చితంగా 42.5% టాక్స్ పే చేయాల్సిందే. ఈ ప్రైజ్‌మనీ నుంచి గుకేశ్ కట్టాల్సిన టాక్స్ గురించి నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇంత టాక్స్ కడితే ఇంక తనకు మిగిలేదేముంది అని షాక్ అవుతున్నారు. కేవలం గుకేశ్ ప్రైజ్‌మనీ గెలుచుకున్న ఎవరైనా ప్రభుత్వానికి టాక్స్ కట్టాల్సిందే.
ట్యాక్స్ ఎంతంటే.. ఈ టోర్నమెంట్‌లో మొత్తం ప్రైజ్‌మనీ రూ. 20.75 కోట్లు. ఎఫ్ఐడీఈ రూల్స్ ప్రకారం టోర్నమెంట్‌లో ప్లేయర్ గెలిచే ఒకో గెలుపుకి రూ. 1.68 కోట్లు ఇస్తారు. అలా గుకేశ్ 3 గేమ్స్‌లో గెలిచి రూ. 5.04 కోట్లు గెలిచాడు. మిగిలిన డబ్బును టాప్ 2 ఫైనలిస్టకు చెరిసగం ఇస్తారు. మిగిలిన 1.5 మిలియన్ డాలర్స్‌ని గుకేశ్‌తో పాటు లైరెన్కి సగం సగం పంచారు. ఇలా మొత్తంగా గుకేశ్ సుమారు 1.35 మిలియన్ డాలర్లు అంటే రూ. 11కోట్లు గెలిచాడు. ఈ గెలుపుతో వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన గుకేశ్ నెట్‌వర్త్ రూ. 21 కోట్లకు చేరింది. అయితే తను గెలుచుకున్న ఈ ప్రైజ్‌మనీలో ప్రభుత్వానికి 30శాతం ట్యాక్స్ స్లాబ్ కట్టాలి. ఇంకా సర్చాజ్, ఇతర ఛార్జీలు మొత్తం కలిపి అంటే సుమారు రూ.4.67 కోట్ల వరకు పన్నులు కట్టాలి. మొత్తానికి గుకేశ్ వల్ల భారత ప్రభుత్వానికి మంచి లాభం వచ్చిందని నెటిజన్స్ అనుకుంటున్నారు, టాక్స్‌ల పేరుతో పెద్ద మొత్తం లాగేశారు.