15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedఆడపిల్లకు మొదటి హీరో నాన్నే..!

ఆడపిల్లకు మొదటి హీరో నాన్నే..!

Date:

ఆడపిల్లలకు తల్లి దగ్గర కంటే, తండ్రి దగ్గరే చనువు బాగా ఉంటుంది. ఎవరి ఇంట్లోనైనా ఆడపిల్లలు తండ్రిని ఎక్కువగా ఇష్టపడితే.. మగపిల్లలు తల్లిని ఇష్టపడతారు. తల్లి కంటే ఎక్కువగా తండ్రిని ఇష్టపడి ఒక స్నేహితుడిలా ట్రీట్‌ చేస్తారు. తండ్రితో కలిసి బయటికి వెళ్తారు. వారి సీక్రెట్స్ ఎక్కువగా తండ్రితోనే చెప్పుకుంటారు. తల్లినీ దైవంగా భావించినప్పటికీ ఆమె కంటే ఎక్కువగా తండ్రితోనే సంతోషంగా గడుపుతారు.

*అమ్మాయి చూసే మొదటి మగవ్యక్తి నాన్న*

ప్రతి ఇంట్లో ఆడపిల్ల తన జీవితంలో చూసే మొదటి మగవ్యక్తి నాన్న. వారు జీవించే విధానం ఆడపిల్లలను ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే వారికి మొదటి హీరో నాన్నే. నాన్న ఆడపిల్లకి బలబలాల గురించి చెబుతారు. ఎప్పుడు బలంగా ఉండాలో ఏ సమస్యని ఎలా ఎదుర్కోవాలో చెప్పడమే కాకుండా.. ఏ సమయంలో ఎలా ఉండాలో కూడా వారే చెబుతారు.

*పక్కన తండ్రి ఉంటే ఒక దైర్యం*

తల్లీ ప్రేమగా చూసినప్పటికీ.. తండ్రి వారిని రక్షిస్తారు, తండ్రి పక్కన ఉంటే ఓ సెక్యూరిటీ ఉన్నట్లుగా భావిస్తారు. ఎవరు ఏం చేయలేరన్న భావన ఆడపిల్లలకి ఉంటుంది. అందరికంటే ఎక్కువగా వారిని చూసేది తండ్రి. వారిని ప్రతి విషయంలోనూ రక్షిస్తారు. అలాగే వారికి కూతుళ్లని కిందకి లాగడానికి ఎవరైనా ప్రయత్నిస్తే దానిని ఎదురిస్తాడు. దీంతో ఆడపిల్లలకి తండ్రి అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది.

*అమ్మాయికి స్వేచ్ఛను ఇచ్చేది నాన్నే*

తాను ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా తన కూతురిని మాత్రం రాణిలా చూసుకుంటారు. ఎప్పుడు తక్కువ చేయడు. వారంతటా వారు ఇండిపెండెంట్‌గా ఎలా ఎదగాలో చూపిస్తాడు. వారికి అంత స్వేచ్ఛనిస్తాడు నాన్న. ఆడపిల్లలు ఎప్పుడు కూడా వారిని జాగ్రత్తగా చుసుకుంటూ వారి వెనుకే నిలబడతాడు. వారి ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎప్పుడు కూడా తగ్గించడు. చదువు, ఉద్యోగం విషయంలో ఎలాంటి సవాళ్లని ఎదుర్కోవాలో ఏ రిస్క్‌ని ఎలా ఎదురించాలో చెబుతారు. మీరు ఎంత ఎత్తుకి ఎదిగినా, కిందికి పడిపోయినా ఎప్పుడు నిరుత్సాహపడరు. కూతురిని ఎప్పటికి బలంగా తయారుచేస్తారు నాన్న.