Thursday, October 31, 2024
HomeUncategorizedమీ వయస్సు 25ఏళ్లు దాటిందా

మీ వయస్సు 25ఏళ్లు దాటిందా

Date:

ప్రస్తుత సమాజంలో మనిషి ఆరోగ్యం ఎప్పుడు, ఏలా ఉంటుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఆరోగ్యంపై ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం మారిన జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారం తినే విధానం వల్ల ప్రతి క్షణం రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఈ కోణంలోమీరు ఎప్పటికప్పుడు కొన్ని పరీక్షలు చేయించుకుంటే.. అనేక వ్యాధుల నుండి సురక్షితంగా ఉంటారు. కాబట్టి 25 సంవత్సరాల వయస్సు తర్వాత ప్రతి సంవత్సరం ఈ 7 టెస్ట్ లు తప్పనిసరిగా చేయించుకోవాలి.

1.CBC: క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం CBC అంటే పూర్తి రక్త పరీక్ష. ఇందులో రక్తంలో ఏయే విషయాలు పెరిగాయో ఈజీగా తెలిసిపోతుంది. ఉదాహరణకు షుగర్ పెరిగినట్లయితే లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే అది తెలుస్తుంది. ఈ ప్యాకేజీలో KFT అంటే మూత్రపిండాల పనితీరు పరీక్ష, LFT అంటే కాలేయ పనితీరు పరీక్ష చేయబడుతుంది. ఇది మూత్రపిండాలు,కాలేయం ఎలా పని చేస్తుందనే దాని గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఈ టెస్ట్ సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి.

  1. HIV Test: వాస్తవానికి ఇప్పుడు మన దేశంలో హెచ్‌ఐవి కేసులు తగ్గాయి. అయితే సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా HIV టెస్ట్ చేయించుకోవాలి. ఈ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే చాలా తేలికగా నయం చేయవచ్చు.
  2. వృషణ పరీక్ష(Testicular test): వృషణ క్యాన్సర్ కేసులు 15 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులలో కూడా నమోదవుతున్నాయి. ప్రతి మనిషి సంవత్సరానికి ఒకసారి వృషణ పరీక్ష చేయించుకోవాలి. దీన్ని డాక్టర్ స్వయంగా చేసి వృషణాలను తాకడం ద్వారా ఏదైనా గట్టిదనం లేదా గడ్డ ఉందా అని తెలుసుకుంటారు. వృషణాల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే 95 శాతం కేసుల్లో అది నయమవుతుంది.
  3. BP Test: బీపీ పరీక్ష చేయించుకోవడం చాలా సులభం కానీ చాలా మంది ఈ పరీక్ష చేయించుకోరు. తమకు రక్తపోటు ఉండదని సాధారణంగా చాలామంది అనుకుంటారు. కానీ 25 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బీపీ టెస్ట్ చేయించుకోవాలి.
  4. హార్ట్ బీట్ రేటు: గుండె చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా కొట్టుకుంటున్నట్లయితే గుండెకు సంబంధించిన ఏదో సమస్య ఉందని అర్థం. అందుచేత గుండె చప్పుడును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. తక్కువ ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి.
  5. కోలన్ క్యాన్సర్ టెస్ట్: 25 ఏళ్ల తర్వాత ఒకసారి కోలన్ క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలి. కడుపు సంబంధిత వ్యాధి ఉన్నట్లయితే లేదా మల విసర్జనకు ఇబ్బందిగా ఉంటే ఈ టెస్ట్ లో తెలిసిపోతుంది.
  6. కంటి పరీక్ష – 25 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత కంటి పరీక్ష సమయం కూడా వస్తుంది. అందుకే మీ కళ్లను ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజుల్లో చాలామంది చిన్నప్పటి నుంచి కళ్లద్దాలు పెట్టుకుంటున్నా కూడా 25 ఏళ్ల తర్వాత ఒకసారి కళ్లను చెక్ చేసుకోవాలి.