Wednesday, January 15, 2025
HomeUncategorizedమనిషి జుట్టులో 90 రోజులు, మూత్రంలో 30 రోజులు

మనిషి జుట్టులో 90 రోజులు, మూత్రంలో 30 రోజులు

Date:

గంజాయి మనిషి ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.? ఈ దురలవాటును మాత్రం మానుకోలేకపోతున్నారు. అయితే గంజాయి తీసుకోవడం వల్ల శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన సైకోఫార్మకాలజిస్ట్ లెన్ మెక్‌క్రెగర్ ఈ విషయమై మాట్లాడుతూ.. గంజాయి తాగిన తర్వాత దాని నుంచి విడుదలయ్యే టెట్రాహైడ్రోకానాబినాల్ (టీహెచ్‌సీ) అనే రసాయనం శరీరంలో చాలా వారాల పాటు శరీరంలో అలాగే ఉంటుందని చెబుతున్నారు.

*అన్ని భాగాలపై ప్రభావం*

గంజాయి ప్రభావం శరీరంలో దాదాపు అన్ని భాగాలపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గంజాయి నుంచి విడుదలయ్యే టెట్రాహైడ్రోకానాబినాల్‌ రసాయనం మనిషి జుట్టులో 90 రోజులు, మూత్రంలో 30 రోజులు, లాలాజలంలో 24 గంటలు, రక్తంలో 12 గంటల పాటు ఉంటుంది. అయితే ఆ వ్యక్తి గంజాయిని ఎన్నిసార్లు తీసుకుంటాడనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

*రక్తంతో పాటు మెదడుకు..*

గంజాయిలోని టీహెచ్‌సీ రసాయనం శరీరంలోని అనేక కణజాలాలకు, అవయవాలకు చేరుతుంది. వీటిలో మెదడు, గుండె, కాలేయం, కొవ్వు ముఖ్యమైనవి. శరీరంలో జీర్ణక్రియ తర్వాత 85 శాతం పదార్థాలు బయటకు వెళ్లిపోతా మిగతావి శరీరంలో పేరుకుపోతాయి. కాలక్రమేణా, శరీర కణజాలాలలో నిల్వ చేయబడిన టీహెచ్‌సీ తిరిగి రక్త ప్రసరణలోకి విడుదల వుతుంది. ఇది తిరిగి కాలేయం ద్వారా జీవక్రియ జరుగుతుంది. గంజాయిలో ఉండే టీహెచ్‌సీ మత్తును పెంచుతుంది. గంజాయిని పీల్చుకున్న వెంటనే టీహెచ్‌సీ రక్తంతోపాటు, మెదడుకు చేరుకుంటుంది. దీంతో మెదడులోని న్యూరాన్లు అదుపు తప్పుతాయి.

*క్యాన్సర్‌ ముప్పు ఎక్కువ*

నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ అండ్ మెడిసిన్ నివేదిక ప్రకారం.. గంజాయిని సేవించడం వల్ల బైపోలార్ డిజార్డర్‌ సమస్య వస్తుంది. ఇది నిరాశ, మానసిక సమస్యలకు కారణమవుతుంది. గంజాయి సేవించే వారిలో క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దీనివల్ల వృషణ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గంజాయిని దీర్ఘకాలంగా సేవించే వారిలో ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తుంది. అలాగే ఆస్తమా వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది.