తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమాచారహక్కు చట్టంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు. అధికారంలోకి పది నెలలు కావస్తున్న ముఖ్యమంత్రి, మంత్రుల దేశ, విదేశీ పర్యటనలు, ప్రజాపాలన ఫిర్యాదులు, పరిష్కారాలు, ఇతర అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసిన కనీస స్పందన లేదు. అప్పీలు చేసిన పట్టించుకునే వారు లేరు. రెండవ అప్పీలు చేద్దామంటే సమాచార హక్కు చట్టం కమిషనర్లు లేరని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌కు మెయిల్, లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. జవాబుదారీతనం, పారదర్శకత పాలన అందిస్తామని చెపుతున్న ప్రభుత్వం అడిగిన సమాచారానికి మాత్రం సమాధానం ఇవ్వడం లేదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కార్యదర్శి కొన్నె దేవేందర్, జాతీయ కార్యవర్గసభ్యులు కొమటి రమేష్‌బాబు, వరికుప్పల గంగాధర్, జి. హరిప్రకాశ్, బత్తిని రాజేశ్. అంజుకర్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.