Sunday, December 22, 2024
HomeRTI దరఖాస్తులుఅక్ర‌మ నిర్మాణాల‌కు అనుమ‌తి ఇచ్చిన అధికారులెవ‌రు

అక్ర‌మ నిర్మాణాల‌కు అనుమ‌తి ఇచ్చిన అధికారులెవ‌రు

Date:

హైద‌రాబాద్ జీహెచ్ఎంసీ ప‌రిధిలో హైడ్రా పేరుతో ఎక్క‌డెక్క‌డ ఎన్ని ఇళ్లు కూల్చివేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కూల్చిన ఇళ్ల వివ‌రాలు తెల‌పండి. ఇళ్ల కూల్చివేత‌కు ఇప్ప‌టివ‌ర‌కు అయినా ఖ‌ర్చు ఎంత‌.. వాటి వివరాలు తెల‌పండి.

మీరు కూల్చిన ఇళ్ల‌కు అనుమ‌తి ఇచ్చిన వివిధ శాఖ‌ల‌కు చెందిన ప్ర‌భుత్వ అధికారులు ఎంత‌మంది. వారిపై ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది అధికారుల‌పై ఏలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారు. వీటికి సంబంధించిన స‌మాచారం స్ప‌ష్టంగా తెలుగులో అందించాల‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ నుంచి హైడ్రా క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి ఆర్టీఐ ద‌ర‌ఖాస్తు చేశామ‌ని పౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి తెలిపారు.