Sunday, December 22, 2024
Homeజాతీయంమ‌న‌దేశంలో డ‌బ్బున్న వాళ్లంటే ద్వేష‌మెందుకు..

మ‌న‌దేశంలో డ‌బ్బున్న వాళ్లంటే ద్వేష‌మెందుకు..

Date:

బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్‌లో జెరోధా సీఈఓ నితిన్‌ కామత్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. సంపన్నుల విషయంలో అమెరికా, భారతపౌరులు వ్యవహరించే తీరుపై యువర్‌ స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధాశర్మ ఈ ప్రశ్న అడిగారు. ”అమెరికాలో ఎవరైనా బాగా సంపాదిస్తే.. వారి ఫొటోలు అక్కడి కవర్‌ పేజీల్లో వస్తాయి. వారు కార్లు కొనుక్కుంటారు. ఇదంతా అక్కడ సర్వసాధారణంగా జరిగిపోతుంది. మన దేశంలో మాత్రం అలా ఎవరైనా ఎదిగితే.. వారేదో తప్పు చేసి సంపాదించారన్న భావన నెలకొంటుంది. వారిపై చాలామందిలో ద్వేషం ఉంటుంది. ఈ పరిస్థితికి కారణం ఏంటి?” అని నితిన్‌ కామత్‌ను ప్రశ్నించారు.

బిలీయనీర్లలో ఒకరైన నితిన్‌ కామత్‌ కూడా ఆమె అభిప్రాయంతో ఏకీభవించారు. దేశంలో ఉన్న సంపదలో అసమానతలే దీనికి కారణమని పేర్కొన్నారు. మన సమాజంలో ఉన్న సోషలిస్టు ఆలోచనా దృక్పథమే కారణమని చెప్పారు. ”అమెరికా పూర్తి పెట్టుబడిదారీ సమాజం. మనం పెట్టుబడిదారుల సమాజంగా నటిస్తున్న సోషలిస్టులం. మన గుండెల నిండా సోషలిజం నిండి ఉంటుంది. అందుకే ఈ పరిస్థితి” అని సమాధానం ఇచ్చారు. మరి ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. సంపద విషయంలో అసమానతలు కొనసాగేంతవరకు పరిస్థితులు మారుతాయని తాను అనుకోవడం లేదని నితిన్‌ కామత్‌ బదులిచ్చారు.