Thursday, January 2, 2025
Homeజాతీయంఅప్పుడు నా ఫిర్యాదుకు పోలీసులు న‌వ్వారు

అప్పుడు నా ఫిర్యాదుకు పోలీసులు న‌వ్వారు

Date:

జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, పడిన అవమానాలు గురించి బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ఓ సారి తన కారు చోరీకి గురికాగా ఫిర్యాదు చేస్తుంటే పోలీసులు నవ్వారని నాటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. ‘కార్తికేయ 2’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

”నాకు డ్రైవింగ్‌ చేయడం నచ్చదు. కానీ, ఓ రోజు అమ్మవారి దేవాలయానికి (ముంబయి) నేనే కారు డ్రైవ్‌ చేస్తూ వెళ్లా. కారును పార్క్‌ చేసి ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్నా. అక్కడి నుంచి చూస్తుంటే.. నా కారును ఓ వ్యక్తి తీసుకెళ్లడం కనిపించింది. వెంటనే కిందికి వచ్చి ఆటో ఎక్కి.. ఆ కారును ఫాలో అవ్వమని ఆటో డ్రైవర్‌కు చెప్పా. మేం అతడిని పట్టుకోలేకపోయాం. చేసేదేంలేక ఫిర్యాదు చేద్దామని సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లా. నా వాహనం ఎలా పోయిందో పోలీసులకు వివరిస్తుంటే.. వారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. అది వారికి సినిమాల్లో కనిపించే సన్నివేశంలా అనిపించింది” అని అన్నారు. ”2003లో టెలివిజన్‌ రంగంలోకి రావాలనే ప్రయత్నంలో ఆర్థికంగా నష్టపోయా. అప్పటికి నటుడిగా మంచి పేరొచ్చినా.. సినీ అవకాశాలు వస్తున్నా నా ఇంటిని, కార్యాలయాన్ని విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. నటుడిగా నిలదొక్కుకునే రోజుల్లో మహాలక్ష్మి టెంపుల్‌ను దర్శించుకునేవాడిని.” అని పేర్కొన్నారు. త్వరలో ‘ఎమర్జెన్సీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.