15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorized34ఏళ్ల కింద‌ట రూ.20 లంచం తీసుకున్న కానిస్టేబుల్

34ఏళ్ల కింద‌ట రూ.20 లంచం తీసుకున్న కానిస్టేబుల్

Date:

ఒక కానిస్టేబుల్ 34 ఏళ్ల కిందట రూ.20 లంచం తీసుకున్నాడనే కేసులో కోర్టు తాజాగా అరెస్ట్ వారెంట్‌ జారీ చేసిన అరుదైన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 1990లో బిహార్‌లోని సహర్సా రైల్వేస్టేషన్‌లో అప్పటి కానిస్టేబుల్‌ సురేశ్ ప్రసాద్‌ సింగ్‌ విధులు నిర్వర్తించేవాడు. 1990 మే 6న స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై కూరగాయల మూటను తీసుకువెళ్తున్న సీతాదేవి అనే మహిళను ఆపి, రూ.20 లంచం ఇవ్వాలని సురేశ్ ప్రసాద్‌ డిమాండ్‌ చేశాడు. ఆమె అతడికి డబ్బులు ఇస్తున్న సమయంలో అప్పటి రైల్వేస్టేషన్‌ ఇన్‌ఛార్జి కానిస్టేబుల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించడంతో అతడిని అరెస్ట్‌ చేశారు. అయితే 1999లో ఆ కానిస్టేబుల్‌ బెయిల్‌ తీసుకొని పరారయ్యాడు. దీంతో అతడికి బెయిల్‌ రద్దు చేసి, అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. నిందితుడు తప్పుడు చిరునామా, వివరాలు ఇవ్వడంతో అతడి ఆచూకీ పోలీసులకు దొరకలేదు.

మాజీ కానిస్టేబుల్‌ను అప్పటినుంచి పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడంతో ఈ కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసి, కోర్టు ముందు హాజరుపరచాలని ముప్పై నాలుగు ఏళ్ల తర్వాత స్పెషల్ విజిలెన్స్ జడ్జి సుదేష్ శ్రీవాస్తవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)ని గురువారం ఆదేశించారు. పోలీసుశాఖలో అవినీతి, దుష్ప్రవర్తనకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరిస్తున్న సమయంలో తాజాగా ఈ కేసుపై కోర్టు దృష్టి సారించినట్లుగా అధికారులు పేర్కొన్నారు.