భారత్‌కు చెందిన తృష్ణా రే ఈ ఏడాది మిస్ టీన్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని క్లింబరీ వేదికగా ఈ పోటీలు జరిగాయి. ఇందులో పెరూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నమీబియా, నెదర్లాండ్స్‌తో సహా వివిధ దేశాలకు చెందిన మోడళ్లు పాల్గొన్నారు. వీరందరినీ వెనక్కినెట్టి మిస్ టీన్ యూనివర్స్ కిరీటాన్ని 19 ఏళ్ల తృష్ణా రే సొంతం చేసుకున్నారు. పెరూకు చెందిన అన్నే థోర్సెన్, నమీబియాకు చెందిన ప్రెషియస్ ఆండ్రీలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
తృష్ణా రే కల్నల్ దిలీప్ కుమార్ రే, రాజశ్రీ రేల కుమార్తె. ఈమెది ఒడిశా రాష్ర్టం. ప్రస్తుతం భువనేశ్వర్‌లో కేఐఐటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన మిస్ టీన్ యానివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచిన ఈమె తాజాగా అంతర్జాతీయ వేదికగా జరిగిన పోటీలోనూ విజయం సాధించారు. ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకురాలు డా.అచ్యుత సమంత ఈసందర్భంగా తృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన వీడియోను నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. పలువురు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈమె విజయానికి సంబంధించిన విషయాలను కేఐఐటీ ఇన్‌స్టిట్యూట్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. ఈమె గెలుపు దేశానికి గర్వకారణమని అందులో పేర్కొన్నారు.