ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ పోరాటంలో 14 మంది మావోలు మృతి చెందారని.. కాల్పుల్లో గాయపడ్డ మిగతా 17 మందిని భద్రతా బలగాలు పట్టుకుని కాల్చి చంపాయని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది. ఇటీవల అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌పై తాజాగా మావోయిస్ట్ పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఎన్ కౌంటర్ జరిగిన 9 రోజుల తర్వాత మావోయిస్టు పార్టీ నుంచి ఖండన వచ్చింది. బస్తర్ మాజీ డివిజనల్ కమిటీ మృతి చెందిన మావోయిస్టులకి నివాళులర్పించినట్లు పేర్కొంది. విప్లవకారులు, ప్రజానీకం తమ నెరవేరని కలలను సాకారం చేసుకునేందుకు దృఢ సంకల్పంతో పని చేయాలని తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ విజ్ఞప్తి చేసింది.