Thursday, November 14, 2024
Homeజాతీయంహేమంత్ సోరెన్‌కు ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌దు

హేమంత్ సోరెన్‌కు ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌దు

Date:

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హేమంత్ సోరెన్ ప్ర‌భుత్వానికి ఓట‌మి త‌ప్ప‌ద‌ని, ఎన్నికల ఫలితాలు వెలువడిన (నవంబర్‌ 23) రోజే సీఎం హేమంత్‌ సోరెన్‌ అండ్‌ కంపెనీకి వీడ్కోలు అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఝార్ఖండ్‌లో మలి విడత ఎన్నికల ప్రచారం సందర్భంగా డుమ్రీలో ఏర్పాటు చేసిన సభలో అమిత్‌ షా ప్రసంగించారు. అధికార దురాశ వల్లే ఝార్ఖండ్‌ ఏర్పాటును వ్యతిరేకించిన ఆర్జేడీ -కాంగ్రెస్‌ ఒడిలో హేమంత్‌ సోరెన్‌ కూర్చోవాల్సి వచ్చిందని మండిపడ్డారు.

కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమన్న అమిత్‌ షా.. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉగ్రవాదం నుంచి విముక్తి చేశారన్నారు. ఝార్ఖండ్‌లో చొరబాట్లను హేమంత్‌ సర్కార్‌ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే చొరబాటుదారులను బహిష్కరిస్తామన్నారు. అనేక పరిశ్రమలు నెలకొల్పి.. ఒక్క యువకుడు కూడా వలస వెళ్లకుండా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. హేమంత్‌ సోరెన్‌ గతంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని సైతం నెరవేర్చలేదన్నారు. భాజపా అధికారంలోకి వస్తే.. యువతకు నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి కల్పించడంతో పాటు 2లక్షలకు పైగా ఖాళీ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.