దేశ రాజధాని ఢిల్లీలోని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. కోర్టు నంబర్ 11, 12 మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన కోర్టు భద్రతా సిబ్బంది.. అగ్నిమాపక శాఖ అధికారుల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనతో 11వ నంబర్ గదిలో జరగాల్సిన బెంచ్ విచారణలను తాత్కాలికంగా రద్దు చేశారు