విద్యుత్ చోరీ చేసిన ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ నియోజకవర్గానికి చెందిన లోక్‌సభ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్‌కు.. ఆ రాష్ట్ర విద్యుత్తు శాఖ 1.91 కోట్ల జరిమాన విధించింది. విద్యుత్తును చోరీ చేసిన ఘటనలో.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీపై విద్యుత్తు చట్టం సెక్షన్ 135 ప్రకారం కేసు బుక్ చేశారు. ఆ ఎంపీ ఇంటికి విద్యుత్తు సరఫరాను కూడా నిలిపివేశారు. విద్యుత్తు శాఖ అధికారులను బెదిరించిన ఘటనలోనూ ఆ ఎంపీ తండ్రి మామ్లూకర్ రెహ్మాన్ బర్క్‌ను కూడా కేసు కింద బుక్ చేశారు.
దీప్ సరాయి ఏరియాలో ఉన్న ఇంటికి ఇన్‌స్పెక్షన్ కోసం వెళ్లిన సిబ్బందిని బర్క్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మీటర్లను నిర్వీర్యం చేసి, అక్రమ రీతిలో ఎంపీ ఇంట్లో విద్యుత్తును వినియోగిస్తున్నట్లు విద్యుత్తు శాఖ సిబ్బంది గుర్తించింది. నవంబర్ 24వ తేదీన సంభల్‌లోని షాహి జామా మసీదు ఘటనలో ఎంపీ రెహ్మాన్‌పై కేసు బుక్ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఎంపీ ఇంట్లో స్మార్ట్ మీటర్లను ఇన్‌స్టాల్ చేశారు. అయితే పాత మీటర్లను పరిశీలిస్తే, గత ఆర్నెల్ల నుంచి ఆ మీటర్లు జీరో యూనిట్ చూపించాయి. ఆ రెండు మీటర్లను ల్యాబ్‌కు పంపగా, ఎంఆర్ఐ టెస్టులో ఆ మీటర్లు ట్యాంపరింగ్ జరిగినట్లు తెలిసింది.