Tuesday, November 19, 2024
Homeజాతీయంశ‌బ‌రిమ‌ల భ‌క్తుల‌కు 26 ప్ర‌త్యేక రైళ్లు

శ‌బ‌రిమ‌ల భ‌క్తుల‌కు 26 ప్ర‌త్యేక రైళ్లు

Date:

తెలుగు రాష్ట్రాల‌లోని శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ మొత్తం 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది.

నవంబర్‌ 18 (ఈ రైలు ఇప్పటికే బయల్దేరింది), నవంబర్‌ 25, డిసెంబర్‌ 2, 9, 16 తేదీల్లో మచిలీపట్నం – కొల్లాం మధ్య (రైలు నం.07145) ; నవంబర్‌ 20, 27, డిసెంబర్‌ 4, 11, 18 మధ్య కొల్లాం- మచిలీపట్నం (రైలు నం.07146) మొత్తం 10 సర్వీసులు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇవి కాకుండా 23, 30 తేదీల్లో మచిలీపట్నం- కొల్లాం (రైలు నం.07147), తిరుగు ప్రయాణంలో నవంబర్‌ 25, డిసెంబర్‌ 1 తేదీల్లో మరో 2 రైళ్లను (రైలు నం.07148) నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. మౌలాలి (హైదరాబాద్‌)- కొల్లాం (రైలు నం.07143) మధ్య నవంబర్‌ 22, 29, 6, 13, 20, 27 తేదీల్లో; కొల్లాం – మౌలాలి (రైలు నం.07144) మధ్య నవంబర్‌ 24, డిసెంబర్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో మొత్తం 12 సర్వీసులు నడపనున్నట్లుు పేర్కొంది.