Friday, December 27, 2024
Homeజాతీయంశబ‌రిమ‌ల ఆల‌య ప‌రిస‌రాల్లో 33పాములు

శబ‌రిమ‌ల ఆల‌య ప‌రిస‌రాల్లో 33పాములు

Date:

శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు బారులు తీరారు. అయితే ఇప్ప‌టికే ఆ ఆల‌య ప‌రిస‌రాల్లో 33 పాముల‌ను ప‌ట్టుకున్నారు. దీంట్లో కామ‌న్ క్రెయిట్‌(అనాలీ), 14 వైల్డ్ స్నేక్స్ ఉన్నాయి. పెరియార్ వన్య‌ప్రాణి సంర‌క్ష‌ణ అట‌వీ ప్రాంతంలో న‌డుస్తున్న స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులు సూచించారు. స‌ర్పాల గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాము కాటు సంఘ‌ట‌న‌లు చాలా త‌క్కువే న‌మోదు అవుతున్న‌ట్లు తెలిపారు. గ‌తంతో పోలిస్తే ఇప్పుడు చాలా త‌క్కువ సంఖ్య‌లో శ‌బ‌రిమ‌ల క్షేత్రంలో పాములు సంచ‌రిస్తున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. గ‌తంలో కింగ్ కోబ్రాలు ఆ ప్రాంతంలో ఉండేవ‌ని, కానీ ఇప్పుడు చాలా వ‌ర‌కు విషం లేని స‌ర్పాలు క‌నిపిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. పాము కాటుకు సంబంధించిన వైద్య చికిత్స స‌న్నిధానం, పంపా వ‌ద్ద అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు.