సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ అప్‌లోడ్ చేస్తే నచ్చిన వ్యక్తులను ట్యాగ్ చేస్తుంటాం. వారికి మన నోటిఫికేషన్ అందుతుంది. అచ్చం అలాంటి సదుపాయాన్నే వాట్సప్ జోడించింది. దీంతో ఇకపై వాట్సప్‌లో స్టేటస్ పెట్టే సమయంలో కాంటాక్ట్‌లో నచ్చిన వ్యక్తులను ట్యాగ్ చేయొచ్చు. వాట్సప్‌లో స్టేటస్ అప్‌లోడ్ చేసే సమయంలో ‘యాడ్ క్యాప్సన్ అనే’ బార్‌కు కుడివైపున ‘@’ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మీ వాట్సప్‌లోని కాంటాక్ట్స్ అన్నీ దర్శనమిస్తాయి. వాటిలో మీకు నచ్చిన వ్యక్తులను మెన్షన్ చేయొచ్చు. స్టేటస్ అప్‌డేట్‌లో మెన్షన్ చేసినవారికి దానికి సంబంధించిన నోటిఫికేషన్ అందుతుంది.