Thursday, January 9, 2025
Homeజాతీయంరైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులలో వైర‌స్‌ స్క్రీనింగ్‌..!

రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులలో వైర‌స్‌ స్క్రీనింగ్‌..!

Date:

దేశంలో రోజురోజుకు హెచ్‌ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వైరస్‌ ఏడుగురికి పాజిటివ్‌గా తేలింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల వద్ద పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో హెచ్‌ఎంపీవీ ఇన్ఫెక్షన్‌ పెరుగుదల నేపథ్యంలో సివిల్ సర్జన్లందరికీ ఒక సలహా జారీ చేసినట్లు హర్యానా ఆరోగ్య మంత్రి ఆర్టీ సింగ్‌రావు తెలిపారు. హర్యానాలో ఇప్పటివరకు ఒక్క హెచ్‌ఎంపీవీ కేసు రికార్డవలేదని.. అయితే, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

హెచ్‌ఎంపీవీ ముప్పు నేపథ్యంలో ప్రభుత్వాలు నిఘాను పెంచాయి. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్క్రీన్‌ చేస్తున్నారు. దగ్గు, జలుబుతో ఆసుపత్రులకు వచ్చే రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వాటిని స్క్రీన్ చేయడంతో పాటు పలు రాష్ట్రాల్లో రోగులను ఉంచేందుకు ఐసోలేషన్‌ వార్డులను సైతం సిద్ధం చేస్తున్నారు. హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ శ్వాసకోశ వ్యవస్థలో సమస్యలను కలిగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా లేని వ్యక్తులకు ప్రమాదకరం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల్లో ఎక్కువగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంది.