Wednesday, January 15, 2025
HomeUncategorizedర‌ష్యా సైన్యంలో 69మంది భార‌తీయులు

ర‌ష్యా సైన్యంలో 69మంది భార‌తీయులు

Date:

రష్యా సైన్యంలో భారతీయులు మొత్తం 91 మంది ఉన్నారు. అందులో ఎనిమిది మంది మృతి చెందగా.. 14 మంది తిరిగి స్వదేశానికి వచ్చారు. మిగిలిన 69 మందిని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈవిషయమై స్వయంగా రష్యా విదేశాంగశాఖ మంత్రితో మాట్లాడాను. ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి మోదీ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. భారత పౌరులు రష్యా సైన్యంలో సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం సైతం ఆ ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సివస్తుంది. వేరే పనికోసం వెళ్లిన పౌరులు రష్యా సైన్యంలో ఇరుక్కున్నారని మేము భావిస్తున్నాం. రష్యా సైన్యంలో ఉన్న భారతీయులు ఎవరినైనా తిరిగి స్వదేశానికి పంపించేందుకు కృషి చేస్తానని ఆ దేశ అధ్యక్షుడు హామీ ఇచ్చారు’ అని జై శంకర్‌ తెలిపారు.

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో కొంతమంది భారతీయులు మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈవిషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం అక్కడున్నవారిని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది. ఇటీవల రష్యాలో పర్యటించిన ప్రధాని సైతం ఇదే విషయంపై పుతిన్‌తో చర్చించిన విషయం తెలిసిందే.