యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2025తోపాటు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమ్స్) పరీక్ష నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు బుధవారం (జనవరి 22) నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. బుధవారం నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఈ ఏడాది మే 25న జరగనుంది.
ఈసారి అన్ని సర్వీసులకు కేవలం 979 ఖాళీలను మాత్రమే యూపీఎస్సీ భర్తీ చేయనుంది. గత ఏడాది భర్తీ చేసిన 1056 పోస్టులతో పోల్చితే ఇప్పుడు 77 పోస్టులు తక్కువగా ఉన్నాయి. అయితే సివిల్ సర్వీసెస్‌తోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో కూడా 150 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు.