Thursday, December 26, 2024
Homeజాతీయంముస్లిం డాక్ట‌ర్‌కు ప్లాట్ అమ్మార‌ని నిర‌స‌న

ముస్లిం డాక్ట‌ర్‌కు ప్లాట్ అమ్మార‌ని నిర‌స‌న

Date:

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మొరాదాబాద్‌లో ముస్లిం డాక్టర్‌కు ఫ్లాట్‌ అమ్మడంపై హిందువులు నిరసన వ్యక్తం చేశారు. ఫ్లాట్‌ను వెనక్కి తీసుకోవాలని అమ్మిన వ్యక్తిని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పెద్ద బ్యానర్‌తో హౌసింగ్ సొసైటీ వద్ద నిరసన చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌ మొరాదాబాద్‌ పోష్‌ ప్రాంతమైన స్థానిక టీడీఐ సిటీ సొసైటీలో నివసించే డాక్టర్ అశోక్ బజాజ్ తన ఫ్లాట్‌ను డాక్టర్ ఇక్రా చౌదరికి విక్రయించారు. ఈ విషయం తెలిసి ఆ హౌసింగ్ సొసైటీకి చెందిన హిందువులు గురువారం ఆ కాలనీ గేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ‘మకాన్ వాపస్ లో’ అన్న పేరుతో పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు. ‘డాక్టర్ అశోక్ బజాజ్ అప్నా మకాన్ వాపస్ లో’ అని నినాదలు చేశారు.

ఆ సోసైటీలో 400కుపైగా హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయని నిరసకారులు తెలిపారు. ఇతర వర్గాల ప్రజలు ఇక్కడ నివసించడం తమకు ఇష్టం లేదన్నారు. సామరస్య వాతావరణానికి భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం డాక్టర్‌కు అమ్మిన ఇల్లు గుడికి సమీంలో ఉందన్నారు. మరోవైపు ముస్లిం డాక్టర్‌కు ఇంటిని విక్రయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేశారని జిల్లా కలెక్టర్‌ అనుజ్ కుమార్ సింగ్ తెలిపారు. సంబంధిత వర్గాలతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. సామరస్యపూర్వక పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.