Saturday, December 28, 2024
Homeజాతీయంమ‌న్మోహ‌న్‌సింగ్‌కు క్రికెట్ జ‌ట్టు నివాళి

మ‌న్మోహ‌న్‌సింగ్‌కు క్రికెట్ జ‌ట్టు నివాళి

Date:

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ మృతి ప‌ట్ల‌ పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో ఉన్న భారత క్రికెట్‌ జట్టు సైతం మన్మోహన్‌కు నివాళులర్పించింది. ఆయన గౌరవార్థం మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో రెండో రోజు టీమ్‌ ఇండియా ఆటగాళ్లంతా చేతికి నల్లబ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు. ఈ మేరకు ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లతో ఉన్న ఫొటోలను బీసీసీఐ ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌ రెండో రోజు టీమ్‌ ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. ఓపెనర్‌ జైశ్వాల్‌ ఆఫ్‌ సెంచరీ చేశారు. ఆస్ట్రేలియా 474 ర‌న్స్‌కు ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది.