Wednesday, January 15, 2025
HomeUncategorizedభార‌త సంప‌న్న మ‌హిళ ఎన్నిక‌ల్లో పోటీ

భార‌త సంప‌న్న మ‌హిళ ఎన్నిక‌ల్లో పోటీ

Date:

భార‌తదేశంలో సంప‌న్న మ‌హిళ‌గా పేరుగాంచిన సావిత్రి జిందాల్ హ‌ర్యానా ఎన్నిక‌ల్లో స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆమె బిజెపి టికెట్‌తో హిస్సార్‌ నుంచి బరిలోకి దిగుతారని భావించారు. కాని హిస్సార్‌ నియోజకవర్గం టికెట్‌ సావిత్రి జిందాల్‌కు ఇవ్వలేదు. ఆ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కమల్‌గుప్తాకు కేటాయించింది. ఆయన గత రెండుసార్లుగా అక్కడినుంచి పోటీ చేసి విజయం సాధించారు.

ఈనేపథ్యంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ… ”హిస్సార్‌ నా ఇల్లు. అక్కడి ప్రజల గోడును వినాల్సిన బాధ్యత నాపై ఉంది” అని పేర్కొన్నారు. తాను బిజెపిలో చేరలేదని.. కాంగ్రెస్‌ను వీడలేదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తన కుమారుడు, కురుక్షేత్ర ఎంపీ నవీన్‌ జిందాల్‌ ఆధ్వర్యంలో కురుక్షేత్రలో జరుగుతున్న బిజెపి సభ్యత్వ నమోదులో తాను పాల్గొనలేదని వెల్లడించారు. తాను బిజెపి సీనియర్‌ నాయకత్వం తీసుకొన్న నిర్ణయంతో ఆగ్రహంగా లేనని పేర్కొన్నారు. ఇదే తన చివరి ఎన్నికలని ఆమె ప్రకటించారు. బిజెపి హయాంలో చాలా పనులు చేసినా.. ఇంకొన్ని మిగిలే ఉన్నాయని వెల్లడించారు. ఈసారి విజయం సాధిస్తే.. పెండింగ్‌లో ఉన్న పనులు మొత్తం పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు. ఈమె కుమారుడు నవీన్‌ జిందాల్‌ ప్రస్తుతం బిజెపి ఎంపీగా ఉన్నారు.